ఇంద్రవెల్లిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
ఇంద్రవెల్లిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి
ఇంద్రవెల్లి, ఆంధ్రప్రభ:
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ.. దేశ సమగ్రత, అభివృద్ధి కోసం రాజీవ్ గాంధీ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ముఖ్యంగా దేశంలో యువత అభ్యున్నతికి, సాంకేతిక (టెక్నాలజీ) రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి మరువలేనిదని స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ముకాడే ఉత్తం, మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ రాథోడ్ మోహన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జహీర్, సర్పంచ్ విఠల్ పాల్గొన్నారు. అలాగే పార్టీ నాయకులు, కార్యకర్తలు గోటు పటేల్, జితేందర్, పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువకులు కార్యకర్తలు ఈ నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
