మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా కర్ర స్వామి

మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నూతన సీఐగా కర్ర స్వామి
కరీమాబాద్, ఆంధ్రప్రభ:
వరంగల్ నగరంలోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) గా కర్ర స్వామి నియమితులయ్యారు. ఈ మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
నియామక ఉత్తర్వుల అనంతరం గురువారం మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కర్ర స్వామి నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఎస్ఐలు శ్రవణ్ కుమార్, నరేష్, మహేష్, రమేష్‌లతో పాటు ఏఎస్ఐలు, పోలీస్ సిబ్బంది నూతన సీఐకి ఘనంగా స్వాగతం పలికి, పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
