2019Pulwama | పీఓకేలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పులు

2019Pulwama | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : 2019 పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులలో ఒకడిగా గుర్తింపు పొందిన హంజా బుర్హాన్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో హతమయ్యాడు. ముజఫరాబాద్‌లో గుర్తుతెలియని వ్యక్తులు అతడిని కాల్చిచంపినట్లు సమాచారం. ఈ ఘటన అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
జైషే మహ్మద్ (JeM) సంస్థకు చెందిన హంజా బుర్హాన్.. పాకిస్తాన్ సైన్యం, ఐఎస్‌ఐ రక్షణలో ఉంటూ భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. 2019లో జరిగిన పుల్వామా దాడిలో 40మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింందే. ఈ దాడిలో కీలక పాత్ర పోషించిన ఇతడు భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు.
ఇటీవల భారత్‌పై దాడులకు పాల్పడిన పలువురు ఉగ్రవాదులు విదేశాల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో హత్యకు గురవుతున్న నేపథ్యంలో హంజా బుర్హాన్ హత్య కూడా అదే కోణంలో చర్చకు వస్తోంది. అయితే ఈ ఘటనపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
