పసుమర్రులో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్..

పసుమర్రులో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్..
- 54 బైక్‌లు, 2 ఆటోలు సీజ్..
చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు నరసరావుపేట డిఎస్పి ఆధ్వర్యంలో చిలకలూరిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పసుమర్రు గ్రామంలో గురువారం పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ తనిఖీలు నిర్వహించారు. ఈ విస్తృత తనిఖీల్లో ఐదుగురు సీఐలు, 10 మంది ఎస్ఐలతో పాటు 70 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలో ఇల్లుఇల్లు జల్లెడ పట్టిన పోలీసులు, ఎలాంటి సరైన పత్రాలు లేని 54 మోటార్ సైకిళ్లను, 2 ఆటోలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, గొడవలు, కొట్లాటలు జరగకుండా శాంతిభద్రతలను కాపాడటమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు మరియు అనుమానిత వ్యక్తుల కదలికలపై నిఘా ఉంచేందుకు గాను ఈ కార్డెన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పోలీస్ ఉన్నతాధికారులు వెల్లడించారు.
