27people | పోలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బిశ్రా కూడా సరెండర్

27people | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ఝార్ఖండ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 27 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు రాష్ట్ర డీజీపీ మిశ్రా వెల్లడించారు. లొంగిపోయిన వారిలో మావోయిస్టు పార్టీ కీలక నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మిసిర్ బిశ్రా కూడా ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
మీడియాతో మాట్లాడిన డీజీపీ మిశ్రా.. ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన ఎన్‌కౌంటర్లలో 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు. అలాగే 44 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో ఇంకా అడవుల్లో ఉన్న మావోయిస్టులు కూడా వీలైనంత త్వరగా లొంగిపోవాలని డీజీపీ సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న పునరావాస కార్యక్రమాలను వినియోగించుకోవాలని కోరారు.
