జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ మరో వీడియో లీక్..

జనసేన ఎమ్మెల్యే శ్రీధర్ మరో వీడియో లీక్..
- నెట్టింట మరోసారి వైరల్
- వీడియో విడుదల చేసిన వీణ
తిరుపతి, ఆంధ్రప్రభ : రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హర్షవీణ విడుదల చేసినట్లు ప్రచారం జరుగుతున్న ఈ వీడియోలో ఎమ్మెల్యే మహిళలతో తనకు ఉన్న సంబంధాల గురించి మాట్లాడుతున్నట్లు వినిపిస్తోంది. ఇప్పటికే ముస్లిం మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో విమర్శలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేపై, తాజా వీడియో మరింత చర్చకు దారి తీసింది. తన కోసం ఇతర మహిళలు కూడా ప్రయత్నించారని ఎమ్మెల్యే హర్షవీణతో మాట్లాడుతున్నట్లుగా వీడియోలో ఉన్న మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.
ఈ వ్యవహారం రాజకీయంగా కూడా వేడెక్కుతోంది. ఒక వర్గం ప్రజలు ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తుండగా, మరోవైపు ఆయన అనుచరులు మాత్రం ఇది కావాలని చేసిన కుట్ర అని ఆరోపిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రతిష్ఠను దెబ్బతీయడానికి పక్కా ప్రణాళికతో వీడియోలను రూపొందించి విడుదల చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ వీడియోపై అధికారికంగా ఎమ్మెల్యే స్పందించారా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కాగా, వీడియో నిజసత్యాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
