Skip to content
Sunday, July 5, 2026
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu

  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్
Andhra Prabha | Telugu News Daily , Latest Telugu News , Latest తెలుగు వార్తలు and LIVE Updates | Breaking News in AP and Telangana | Top Stories in Telugu
  • ముఖ్యాంశాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • అనంతపురం
    • కడప
    • కర్నూలు
    • కృష్ణా
    • గుంటూరు
    • చిత్తూరు
    • తూర్పు గోదావరి
    • నెల్లూరు
    • పశ్చిమ గోదావరి
    • ప్రకాశం
    • విజయనగరం
    • విశాఖపట్నం
    • శ్రీకాకుళం
  • తెలంగాణ‌
    • ఆదిలాబాద్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
    • నిజామాబాద్
    • మహబూబ్‌నగర్
    • మెదక్
    • రంగారెడ్డి
    • వ‌రంగ‌ల్
    • హైదరాబాద్
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • ఆదివారం
  • భక్తిప్రభ
  • E-PAPER
  • More
    • అందం
    • వంటిల్లు
    • క్రీడాప్రభ
    • బిజినెస్
    • ఫోటో గ్యాలరీ
    • వీడియోలు
    • ఔరా – కార్టూన్

CJP.. The new digital revolution I 2105 Iసీజేపీ.. స‌రికొత్త డిజిట‌ల్ విప్ల‌వం!

Ramakanth Vuriti May 21, 2026 Digital political party founded by Delhi youth,  Intellectuals give suggestions...,  Krakoch Janata Party as a social media platform Social media sensation!,  Millions of followers..,  prabhanews.com

CJP.. The new digital revolution I 2105 Iసీజేపీ.. స‌రికొత్త డిజిట‌ల్ విప్ల‌వం!

సోష‌ల్ మీడియా వేదిక‌గా క్రాకోచ్ జ‌న‌తా పార్టీ

  • సోష‌ల్ మీడియాలో ప్ర‌భంజ‌నం!
  • సీజేఐ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో పుట్టుకొచ్చిన వైనం
  • ఢిల్లీ యువ‌కుడు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పొలిటిక‌ల్ పార్టీ
  • లక్ష‌ల్లో ఫాలోవ‌ర్సు.. మేథావులు సూచ‌న‌లు…

CJP.. The new digital revolution ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ (జాతీయం) : సీజేపీ.. స‌రికొత్త డిజిట‌ల్ విప్ల‌వానికి నాంది ప‌లికింది.. సోష‌ల్ మీడియా వేదిక‌గా క్రాకోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) సోష‌ల్ మీడియాలో ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న‌ది. సీజేఐ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఢిల్లీకి చెందిన ఓ యువ‌కుడు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్ పొలిటిక‌ల్ పార్టీ ఇది. ఈ పార్టీకి సోష‌ల్ మీడియాలో లక్ష‌ల్లో ఫాలోవ‌ర్సు ఉన్నారు. ఇంకా చేరుతున్నారు కూడా! పార్టీ నిర్మాణంపై మేథావులు సూచ‌న‌లు ఇస్తున్నారు. ఇందుకు వ్య‌వ‌స్థ‌పాకుడు కూడా సానుకూలంగా స్పందిస్తున్నాడు.

CJP.. The new digital revolution సోష‌ల్ మీడియా వేదికగా కొత్త పార్టీ
ఇంత‌వ‌ర‌కు అన్ని రాజ‌కీయ‌పార్టీలు త‌మ వ్యూస్‌, విమ‌ర్శ‌లకు సోష‌ల్ మీడియాను వేదిక‌గా చేసుకుంటే ఇప్పుడు ఏకంగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ పార్టీ పుట్టుకువ‌చ్చింది. ఓ ముప్ప‌యి ఏళ్ల యువ‌కుడు ఏర్పాటు చేసిన కాక్‌రోచ్ జ‌న‌తా పార్టీ (సీజేపీ) సోష‌ల్ మీడియాలో ప్ర‌భంజ‌నం సృష్టిస్తున్న‌ది. మూడు రోజుల్లో 45 లక్షల మంది ఫాలోవ‌ర్లు రావ‌డం దేశ చ‌రిత్ర‌లో అరుదైన విష‌యం. సుప్రీకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఈ ఆన్‌లైన్ పొలిటిక‌ల్ పార్టీకి ఆద‌ర‌ణ ల‌భిస్తున్న‌ది. స‌రికొత్త డిజిటల్ విప్ల‌వానికి ఈ సీజేపీ నాంది ప‌లికింది.

CJP.. The new digital revolution ఎవ‌రూ ఊహించ‌ని పార్టీ…
మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు సిద్ధాంత‌లు, ఆశ‌యాల‌తో స్థాపించిన రాజ‌కీయ‌పార్టీలు చూశాం. అనేక ఏళ్లుగా రాజ‌కీయాల్లో ఉంటూ అక్క‌డ ఇమ‌డ‌లేక‌, అలాగే సినిమా రంగం నుంచి వ‌చ్చిన ఎంద‌రో పార్టీలు స్థాపించి వివిధ రూపాల్లో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకుంటూ మ‌నుగ‌డ సాధిస్తున్నారు. ఇప్పటి వరకు ఇలాంటివే తెలుసు. కానీ తాజాగా సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ సరికొత్త రాజకీయ పార్టీ వెలుగులోకి వచ్చింది. అది కూడా ఎవరూ ఊహించని ఓ సరికొత్త పేరుతో. అదే కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ). ఢిల్లీకి చెందిన 30 ఏళ్ల యువకుడు అభిజీత్ దీప్కే.. ఈ పార్టీని స్థాపించారు.

CJP.. The new digital revolution దుమారం రేపిన సీజేఐ వ్యాఖ్య‌లు
ఓ కేసు విష‌యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దేశంలోని నిరుద్యోగులు సోమరిపోతులుగా, బొద్దింకలుగా మారిపోయారని.. వారంతా జర్నలిస్టులు, న్యాయవాదులు, సమాచార హక్కు కార్యకర్తల ముసుగులు వేసుకుని వ్యవస్థలపై దాడులకు తెగబడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య‌లు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. ఆ తర్వాత తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని సీజేఐ వివరణ ఇచ్చినప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

CJP.. The new digital revolution ఢిల్లీకి చెందిన యువ‌కుడు…
సీజేఐ వ్యాఖ్యలకు డిజిటల్ రూపంలో కౌంటర్ ఇచ్చేందుకే.. ఢిల్లీకి చెందిన అభిజీత్ దీప్కే మే 16వ తేదీన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని స్థాపిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ప్రజాధనం ఎటు పోతుందో పాలకులను నిలదీయడమే ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నాడు. ఈ విష‌యం ప్ర‌క‌టించిన కొన్ని గంట‌ల్లోనే సోష‌ల్ మీడియా వేదిక‌గా యువ‌కులు స్పందించారు. కేవలం 48 గంటల్లోనే ఏకంగా 40 వేల మందికి పైగా యువత ఇందులో సభ్యులుగా చేరి రికార్డు సృష్టించారు.

CJP.. The new digital revolution ప్ర‌ముఖుల ట్వీట్లు…
లోక్‌సభలో అధికార పక్షంపై నిప్పులు కురిపించే తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఫైర్‌బ్రాండ్ ఎంపీ మహువా మొయిత్రా నేను మీతో కలిసి పని చేయవచ్చా? అంటూ ఆమె ట్వీట్ చేశారు. దీనికి సీజేపీ స్వాగతం ప‌లికింది. మరో టీఎంసీ ఎంపీ, మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ సైతం ఇందులో చేరడానికి అర్హతలేంటని అడగగా.. “1983 క్రికెట్ వరల్డ్ కప్ గెలవడానికి మించిన అర్హత ఏముంటుంది సార్” అంటూ సీజేపీ సమాధానం ఇచ్చింది.

CJP.. The new digital revolution పార్టీ నిర్మాణానికి అంజ‌లి భ‌ర‌ద్వాజ్ సూచ‌న‌లు
ప్రముఖ సామాజిక కార్యకర్త అంజలి భరద్వాజ్ ఈ పార్టీ అజెండాను మరింత బలోపేతం చేయడానికి కొన్ని కీలక సూచనలు చేశారు. సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు ఈ పార్టీ ఎల్లప్పుడూ జవాబుదారీగా ఉండాలి. ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గానీ, అజ్ఞాత వ్యక్తుల నుంచి గానీ ఎలాంటి విరాళాలు స్వీకరించకూడదు. భవిష్యత్తులో ఎలాంటి రహస్య ‘కాక్రోచ్ కేర్స్ ఫండ్’ను ప్రారంభించబోమని హామీ ఇవ్వాలి. ఈ సూచనలన్నింటినీ సీజేపీ స్వాగతించడమే కాకుండా వీటన్నింటినీ తమ అధికారిక మేనిఫెస్టోలో భాగం చేస్తున్నట్లు ప్రకటించింది.

CJP.. The new digital revolution నిరాశ‌లో ఉన్న యువ‌త‌కు ఇదో వేదిక‌…
సోష‌ల్ మీడియాలో సంచలనంగా మారిన ఈ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది అప్ర‌స్తుతం. కానీ నిరాశ‌లో ఉన్న యువ‌త‌కు ఈ పార్టీ ఒక వేదిక‌గా క‌నిపించింది. యువత నిరసనను తెలపడానికి ఇదొక సరికొత్త మార్గంగా నిలిచింది.

CJP.. The new digital revolution ‘కాక్రోచ్ జనతా పార్టీ’ పేరుతో ట్రెండింగ్
‘కాక్రోచ్ జనతా పార్టీ’ అనే పేరుతో చేపట్టిన ఈ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ఆకట్టుకుంటోంది. యువకులు బొద్దింకల దుస్తులు ధరించి, నదీ తీరంలోని ప్లాస్టిక్ వ్యర్థాలను, చెత్తను సంచుల్లో నింపుతూ శుభ్రం చేస్తున్న వీడియోలు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

ALSO READ “: China Russia Warning : మళ్లీ ‘అడవి చట్టం’ Andhra Prabha Top Story

  • బైకు అదుపుతప్పి డీసీపీ గన్ మెన్‌కు తీవ్ర గాయాలు
  • 21May2026 | గురువారం నేటి పంచాంగం

You May Also Like

Crime

Crime| బట్టబయలైన దంపతుల బాగోతం..

January 14, 2026 Praneeth Kumar

ఏపీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థి ఖ‌రారు..

April 28, 2025 Pavan Chandragiri

10 people died | లోయ‌లో ప‌డిన బ‌స్సు..

December 26, 2025 Bala Raju

కేంద్రం కొత్త షాక్..

October 5, 2025 Pavan Chandragiri

Gold, Silver price Fall | దిగొచ్చిన వెండి.. శాంతించిన ప‌సిడి

January 22, 2026 Sowjanya Anneboina

HYD | పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం..

February 10, 2025 Bala Raju

కార్టూన్ ‘ఔరా’:

5th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’

హైదరాబాద్ వార్తలు :

  • ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు..
  • స్టెరాయిడ్స్ మాఫియా బట్టబయలు…
  • 100 రోజుల్లోనే ఇంతా..
  • Theft Hyd | ముఠా అరెస్ట్… రూ.29లక్షల సొత్తు స్వాధీనం
  • IIIT Hyderabad | ట్రిపుల్‌ ఐటీలో కలకలం
  • Police SI Promotion | ఆరు నెలలు లూప్ లైన్ లో పని చేస్తే ప్రమోషన్
  • Bhadrachalam Temple | శ్రీ సీతారాముల సన్నిధిలో ఐజీ
  • shamshabad airport | 150మంది ప్రయాణికులకు తప్పిన ప్రమాదం
  • TRS | కవితకు ఈసీ షాక్
  • Telangana | ఆరెంజ్ అలర్ట్ జారీ

తాజా వార్తలు :

  • ఏడుగురు మత్స్యకారులు గల్లంతు
  • Dairy-Farmers-Allege : ఆయన పితుకుడే వేరబ్బా Andhra Prabha Top Story
  • July 05 Sunday 2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక
  • 5thjuly2026 | ఆదివారం నేటి పంచాంగం
  • 5th July Cartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ‘ఔరా’
  • రంగా ఆశయాలకు యువత వారసులు కావాలి
  • ENG vs IND 2nd T20 | బెతెల్ మెరుపులు.. శ్రేయస్‌కు మళ్లీ షాక్..
  • రఘునాథపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా గాదె మహేందర్ రెడ్డి…
  • గల్ఫ్ దేశాల పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్
  • ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు..

అంతర్జాతీయం :

  • Ap-Cm-Angry : శాంతి భద్రతల్లో రాజీ లేదు Andhra Prabha Top News
  • ప్రధాని మోదీకి బెదిరింపులు… రంగంలోకి దిగిన ఫెడరల్ పోలీసులు
  • Breaking news | ప్రధాని మోదీకి బెదిరింపులు…
  • Cm-Cbn-Distributes : కంగుంది ఖుషీ ఖుషీ Andhra Prabha Top Story
  • Cancer Drug Cost | అమెరికాలో రూ.85 వేల.. భారత్‌లో రూ.35కే?

జాతీయం :

  • గల్ఫ్ దేశాల పర్యటనకు విదేశాంగ మంత్రి జైశంకర్
  • ప్రధాని మోదీకి బెదిరింపులు… రంగంలోకి దిగిన ఫెడరల్ పోలీసులు
  • Bhushi Dam Overflow | 24 గంటల్లో 116 మి.మీ. వర్షపాతం..!
  • Breaking news | ప్రధాని మోదీకి బెదిరింపులు…
  • TMC Internal Crisis | పార్టీకి బెంగాల్ అధ్యక్షురాలు రాజీనామా

కెరీర్ :

  • swami vivekananda | యువతకు దిక్సూచి అయిన మహానుభావుడు..
  • Notification | ఇంజినీరింగ్ అభ్యర్థులకు భారీ అవకాశం
  • 13thDOST | ముందు మొత్తం చెల్లిస్తేనే అడ్మిషన్ అంటున్న ప్రభుత్వ కళాశాలలు
  • భారీ జాబ్ అలర్ట్
  • AP EAPCET 2026 Results | ఈఏపీసెట్‌లో విద్యార్థినులదే పైచేయి
  • AP EAPCET 2026 Results | విద్యార్థుల విజ్ఞప్తితో వాయిదా
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్
    • కృష్ణా
    • గుంటూరు
    • విశాఖపట్నం
    • కర్నూలు
    • నెల్లూరు
  • తెలంగాణ‌
    • హైదరాబాద్
    • వ‌రంగ‌ల్
    • కరీంనగర్
    • ఖ‌మ్మం
    • నల్గొండ
  • భక్తిప్రభ
  • ఆదివారం
  • ఆరోగ్యం
  • సినిమా
  • కెరీర్
  • క్రైం
  • About us
  • Privacy Policy
  • Contact Us
  • EDITORIAL POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS

Copyright © 2026 . All rights reserved. Andhra Prabha Publications Ltd. | www.prabhanews.com