prime minister | ‘మెలోడీ’ చాక్లెట్ వ్యాఖ్యలు వైరల్

prime minister | ‘మెలోడీ’ చాక్లెట్ వ్యాఖ్యలు వైరల్

prime minister |ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ ఇటలీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభం ముంచుకొస్తోందని ప్రజలకు చెబుతూ.. తానే విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని ఎద్దేవా చేశారు.

మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ప్రజలకు విదేశాలకు వెళ్లొద్దని సూచించే ప్రధాని మోడీ.. స్వయంగా ఖరీదైన విమానాల్లో విదేశీ పర్యటనలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన పెరుగుతోందన్నారు.

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ‘మెలోడీ’ చాక్లెట్ ఇచ్చి రీల్స్ చేస్తున్నారని రాహుల్ సెటైర్లు వేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Leave a Reply