పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన

పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన

ఎడ్ల బండి పై కాంగ్రెస్ నేతలు

కరీంనగర్ టౌన్ ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరిట ఇంధన ధరలను పెంచడానికి నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. బుధవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ లో కాంగ్రెస్ జిల్లా పార్టీ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సుడా అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డిల ఆధ్వర్యంలో నిరసనగది గారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను నిరసిస్తూ ఎడ్ల బండి పై ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పన్నుల పేరిట ఇంధనా ధరలను పెంచడం సిగ్గుచేటు అన్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా మోడీ ప్రభుత్వం వారంలో రెండుసార్లు ఇంధన ధరలు పెంచడం సరైనది కాదన్నారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తికాగానే కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడం ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. నిరసన కార్యక్రమంలో అంజన్ కుమార్ తో పాటు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.