తహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ శైలేందర్

తహసీల్దార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ శైలేందర్

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ:
కమ్మర్ పల్లి మండల నూతన తహసీల్దార్ ఎం.నరేష్‌ను మంగళవారం ఉప్లూర్ గ్రామ సర్పంచ్ ఏనుగందుల శైలేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌ నరేష్‌కు సర్పంచ్ శైలేందర్ శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా గ్రామానికి సంబంధించిన పలు విషయాలపై వారు చర్చించారు. ఉప్లూర్ గ్రామంలోని రైతులు, విద్యార్థులు, వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు సత్వరం అవసరమైన సర్టిఫికెట్లు మంజూరు చేయాలని తహసీల్దార్‌ను సర్పంచ్ కోరారు. ప్రభుత్వ కార్యాలయం చుట్టూ ప్రజలు ఇబ్బంది పడకుండా దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు దీనిపై తహసీల్దార్ సానుకూలంగా స్పందించారు. ఈ మర్యాదపూర్వక కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు, అడ్వకేట్ సుంకరి విజయ్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు నజీర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply