వేట నిషేధ భృతి మత్స్యకారుల ఖాతాల్లో జమ

వేట నిషేధ భృతి మత్స్యకారుల ఖాతాల్లో జమ

జిల్లాలో 16737 మంది మత్స్యకారులకు రూ.33.47 కోట్లు
ఇన్ చార్జ్ జిల్లా కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : వేట నిషేధ భృతి మత్స్యకారుల ఖాతాల్లో జమ అయినట్లు ఇన్ చార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్ తెలిపారు . రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లా కావలి నుండి మత్స్యకారుల ఖాతాలకు మత్స్యకారుల సేవలో పథకాన్ని మంగళవారం జమ చేశారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ, సముద్ర మత్స్య సంపద సంరక్షణ, అభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15 నుండి జూన్ 14 వరకు (61 రోజులు) సముద్రంలో చేపల వేట నిషేధం అమలు చేయడం జరుగుతుందన్నారు.

ఈ కాలం తూర్పు తీరంలో ముఖ్యమైన చేపలు, రొయ్యల జాతుల సంభవ కాలం కావున చేపల వేట నిషేధం అమలు జరుగుతోందాన్నారు . చేపల వేట నిషేధ కాలంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లలేని మత్స్యకార కుటుంబాల జీవనోపాధి నష్టాన్ని భర్తీ చేయుటకు ప్రభుత్వం భృతి అందిస్తోందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 4388 పడవలు ఉండగా 16737 మంది మత్స్యకారులకు 33.47 కోట్ల రూపాయలు బ్యాంకు ఖాతాలో జమ చేసినట్లు చెప్పారు.

జిల్లాలో నియోజక వర్గాల వారీగా మత్స్యకారుల సేవలో పథకం ఎచ్చెర్ల నియోజకవర్గంలో 1266 పడవలు ఉండగా 4592 మంది మత్స్యకారులకు 918.4 లక్షల రూపాయలు, శ్రీకాకుళం నియోజకవర్గంలో 847 పడవలు ఉండగా 3166 మంది మత్స్యకారులకు 633.2 లక్షల రూపాయలు, నరసన్నపేట నియోజకవర్గంలో 341 పడవలు ఉండగా 1412 మంది మత్స్యకారులకు 282.4 లక్షల రూపాయలు, టెక్కలి నియోజకవర్గంలో 347 పడవలు ఉండగా 1490 మంది మత్స్యకారులకు 298 లక్షల రూపాయలు, పలాస నియోజకవర్గంలో 573 పడవలు ఉండగా 2256 మంది మత్స్యకారులకు 451.2 లక్షల రూపాయలు, ఇచ్చాపురం నియోజక వర్గంలో 1014 పడవలు ఉండగా 3821 మత్స్యకారులకు 764.2 లక్షల రూపాయలు మత్స్యకారుల బ్యాంకు ఖాతాలకు జమ చేసినట్లు వివరించారు.

అనంతరం మత్స్యకారులకు మత్స్యకారుల సేవలో చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో పలాస, నరసన్నపేట, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గ శాసన సభ్యులు గౌతు శిరీష, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్, నడికుదిటి ఈశ్వరరావు, డిసిఎంఎస్ ఛైర్మన్ చౌదరి అవినాష్, గ్రంధాలయం ఛైర్మన్ విఠల్ రావు, మత్స్య శాఖ ఇన్ చార్జ్ డిడి డి. గోపికృష్ణ, మత్స్యకారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply