Target 2028 : ఆ సెల కల కాదు Andhra Prabha Spl Story

Target 2028 : ఆ సెల కల కాదు Andhra Prabha Spl Story
- వరికపూడికి గ్రీన్ సిగ్నల్
- కొత్త క్యాలండర్ లో చోటు
- 2028 డిసెంబర్ టార్గెట్
- సీఎం చంద్రబాబు నిర్దేశం
- 84,500 ఎకరాలకు సాగునీరు లక్ష్యం
- 70 ఏళ్ల కల సాకారం దిశగా అడుగులు
- “ఆంధ్రప్రభ ఎఫెక్ట్”
(పల్నాడు ప్రతినిధి, ఆంధ్రప్రభ)

Target 2028 : ఏపీలో 36 ప్రాజెక్టు లను 2028 డిసెంబర్ లోపు పూర్తిచేయాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్దేశించారు. ఇటీవల నిర్వహించిన కలెక్టర్ల సదస్సు లో 25 ప్రాజెక్టుల క్యాలెండర్లను వెల్లడించారు. తాజాగా సోమవారం మరో 11 ప్రాజెక్టులను అందులో చేర్చారు. వాటిల్లో “వరికపూడి సెల” కూడా చేర్చడం హర్షించదగ్గ పరిణామం అని చెప్పవచ్చు. “ఏడు దశాబ్దాల కల – వరికపూడిసెల” అనే శీర్షిక ఏప్రిల్ 29వ తేదీన “ఆంధ్రప్రభ” మొదటి పేజీ లో ప్రచురీతమైన సంగతి పాఠకులకు విధితమే… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనతో 2028 డిసెంబర్ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కానుందని తెలుస్తోంది. మరో 20 మాసాల వ్యవధిలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగింది. మొత్తంగా చూస్తే వరికపూడి సెల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పకనే తెలుస్తోంది.
Target 2028 : వరికపూడి సెల ముఖచిత్రం

- జిల్లాలు రెండు:- పల్నాడు, మార్కాపురం.
- నియోజకవర్గాలు:-3
- మాచర్ల, వినుకొండ, యర్రగొండపాలెం.
- మండలాలు:-6
- వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, మాచర్ల, బొల్లాపల్లి, పుల్లలచెరువు. అంతేకాకుండా 30 చెరువులు, 100 గ్రామాలు, 1.3 లక్షల ఎకరాలకు సాగునీరు,
5 లక్షల ప్రజలకు త్రాగునీటి కోసం 70 ఏళ్లుగా పోరాటం….!
Target 2028 : ప్రభుత్వం డిజైన్ ప్రకారం

ఈ ప్రాజెక్టు ద్వారా 84,500 ఎకరాలకు సాగునీరు, 20 వేల మందికి తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. రూ.3,227.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టు వల్ల 25 గ్రామాలకు సాగునీరు, 20 వేల మందికి తాగునీరు అందుతుంది. ఈ ప్రాజెక్ట్ కోసం 270 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించారు. అడిగొప్పుల, ఆత్మకూరు, దరివేముల ప్రాంతాల్లో సేకరించనున్నారు. ఈ భూముల్లో 19.13 హెక్టార్లు అటవీ భూమి ఉంది. 4.86 టీఎంసీల నీటిని వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల్లోని పొలాలకు సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వరికపూడిశెల వాగు నుంచి ఎత్తిపోయాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు గ్రామస్తులు చేసిన విజ్ఞప్తి మేరకు ప్రాజెక్టు పరిధిని విస్తరించనున్నారు. మొదట 24,900 ఎకరాలకు పరిమితమైన ఈ ప్రాజెక్టు పరిధిని 84,500 ఎకరాలకు పెంచారు. దీని కోసం గతేడాది అక్టోబర్ 31న జీవో కూడా విడుదలైంది. ఈ ప్రాజెక్టు వల్ల పల్నాడు జిల్లాలోని అనేక ప్రాంతాల ప్రజలకు మేలు జరుగుతుంది.
ALSO READ : Kharif 2026 : సాగుకు ఏపీ రెడీ Andhra Prabha Top News
