Indian Mangoes in USA | అమెరికాలో భారత మామిడి పండ్లకు భారీ డిమాండ్

Indian Mangoes in USA | అమెరికాలో భారత మామిడి పండ్లకు భారీ డిమాండ్
Indian Mangoes in USA | అల్ఫోన్సో, కేసర్ రకాల అమ్మకాల్లో జోరు
మామిడి దౌత్యంతో అమెరికాకు చేరిన భారత రుచులు
సూపర్ మార్కెట్లలో ముందస్తు బుకింగ్స్
ప్రీమియం మామిడి పండ్లకు వేల డాలర్ల క్రేజ్
Indian Mangoes in USA | న్యూఢిల్లీ: అమెరికాలో భారత్ మామిడి పండ్లకు భలే గిరాకీ ఉంది. అక్కడి సూపర్ మార్కెట్లలో వీటి అమ్మకాలు భారీగా ఉన్నాయి. దిగుమతులు పరిమితంగా ఉండటంతో ధర ఎక్కువగానే ఉంది. అయినా ఇండియా నుంచి వస్తున్న అల్ఫోన్సో, కేసర్, బంగినపల్లి వంటి పలు రకాలు భారీగా అమ్మకాలు జరుపుతున్నాయి.
అమెరికాలోని సియాటిల్ సూపర్ మార్కెట్లలో మామిడి సబ్స్క్రిప్షన్ బాక్సులు అందుబాటులో ఉన్నాయి. భారత్ నుంచి వస్తున్న ప్రీమియం రకాలు సూపర్ మార్కెట్లలో క్షణాల్లో అమ్ముడవుతున్నాయి. అమెరికాలో భారత మామిడి పండ్లకు ఉన్న క్రేజ్ వాషింగ్టన్‌లోని సియాటెల్లో ఉన్న ఒక సూపర్ మార్కెట్లో కనిపించింది. అక్కడ ఉన్న పలు షాపుల్లో ఇండియా నుంచి వచ్చిన కేసర్, అల్ఫోన్సో మామిడి పండ్లు వేగంగా అమ్ముడయ్యాయి.
అమెరికాలో చాలా సూపర్ మార్కెట్లు మామిడి పండ్ల కోసం కస్టమర్ల నుంచి ముందుగానే బుకింగ్స్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. అమెరికా చేరకముందే సూపర్ మార్కెట్లు వీటిని అమ్మేస్తున్నాయి. 12 మామిడి పండ్లు ఉన్న బాక్స్ ధర 60 డాలర్లుగా ఉంది.
సియాటిల్‌లోని భారత కాన్సులేట్ జనరల్ Prakash Gupta ఏడాదిపాటు జరిపిన ప్రయత్నాల తరువాత భారత్ నుంచి మామిడి పండ్ల దిగుమతులు అమెరికా చేరుతున్నాయి. వీటి కోసం తాను “మామిడి దౌత్యం” నడిపించినట్లు ఆయన చెప్పారు. మామిడి పండ్ల వల్ల కుటుంబాల మధ్య బంధం బలపడుతుందని, అందుకే ఇవి చాలా ప్రత్యేకమైనవి అని గుప్తా చెప్పారు.
అమెరికా మార్కెట్లలో మెక్సికో నుంచి వస్తున్న మామిడి పండ్లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. భారత్ మామిడి రకాల రుచి మూలంగా వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. భారత్ మామిడి పండ్లకు ఉన్న క్రేజ్ గురించి The Wall Street Journal ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.
కొన్ని రకాల మామిడి పండ్ల బాక్స్ 1000 డాలర్లకు పైగా ఉందని, అయినా వీటి అమ్మకాలు భారీగా ఉన్నాయని తెలిపింది. మామిడి సీజన్‌లో ప్రతివారం కొనుగోలు చేసే వారికి 1000 డాలర్ల పాస్ ద్వారా నేరుగా డోర్ డెలివరీ చేస్తున్నామని శర్మ కంపెనీ, జడ్‌ఆడ్ మ్యాంగో సంస్థలు తెలిపాయి. ఇలాంటి కస్టమర్లకు సీజన్ మొత్తం ప్రతివారం మామిడి పండ్లను పంపిస్తామని శర్మ కంపెనీ తెలిపింది. భారత్‌లో 2.5 కోట్ల మెట్రిక్ టన్నుల మామిడి పండ్ల ఉత్పత్తి ఉన్నప్పటికీ కేవలం 1 శాతం మాత్రమే ఎగుమతులు జరుగుతున్నాయి.
