నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన

నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపన

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ:
నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం హస కొత్తూరు గ్రామంలో నూతన డ్రైనేజీ నిర్మాణ పనులకు సోమవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. గ్రామ సర్పంచ్ నలిమేల రేవతి గంగారెడ్డి స్థానిక గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులతో కలిసి ఈ నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో మురుగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు ఈ డ్రైనేజీ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. ఎక్కడా నిధుల దుర్వినియోగం జరగకుండా, పనులను అత్యంత నాణ్యతా ప్రమాణాలతో నిర్మించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. వర్షాకాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామస్థులకు ఇబ్బందులు కలగకుండా ఈ పనులను సకాలంలో పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

ఈ శంకుస్థాపన కార్యక్రమంలో హస కొత్తూరు గ్రామ ఉప సర్పంచ్ ఏనుగు మనోహర్, వార్డు సభ్యులు పసుల గంగు, కల్లెడ కాశవ్వ, పెద్ది సృజన్, కుందేటి శ్రీనివాస్, కనుక నరసయ్య, రాధారపు గంగాధర్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఎడ్ల శ్రీకాంత్, లక్మా రణధీర్ స్థానిక గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply