crores | తప్పుడు ప్రచారం చేస్తోన్న బీఆర్ఎస్

crores | తప్పుడు ప్రచారం చేస్తోన్న బీఆర్ఎస్
crores of rupees | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తో పాటు బీజేపీపై బీఆర్‌ఎస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కోట్ల రూపాయలు ఖర్చు చేసి రాష్ట్రవ్యాప్తంగా పోస్టర్లు ఏర్పాటు చేశారని విమర్శించారు.
బండి సంజయ్ ఎలాంటి తప్పు చేయలేదని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. వ్యక్తిగత అంశాలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం సరికాదన్నారు.
కేటీఆర్ బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌కు నైతిక విలువలు లేవని తీవ్ర విమర్శలు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు మానుకోవాలని సూచించారు.
