జెండా ఊపి మారథాన్ ప్రారంభించిన ఎంపిడిఓ తాళ్లూరి రవి

జూలూరుపాడు, ఆంధ్రప్రభ ; తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా సాయిబాబా ఆలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు 2 కె రన్ నిర్వహించారు.సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో 99రోజుల కార్యాచరణలో భాగంగా ప్రభుత్వ అధికారులు,సిబ్బంది,గ్రామ పంచాయతీ సర్పంచులు, ఉప సర్పంచులు,పంచాయతీ కార్యదర్శులు,వార్డు సభ్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు 2కె రన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ తాళ్లూరి రవి మాట్లాడుతూ.. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణలో యువకులు, విద్యార్థులు, ప్రజలనభాగస్వామ్యం, శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసానికి వ్యాయామం,పరుగు ముఖ్యమన్నారు.
యువజన, క్రీడాల శాఖ ఆధ్వర్యంలో ఫిట్,ఆక్టివ్ తెలంగాణ,మారథాన్, ఫిజికల్ లిటరసీపై 2కె రన్ కార్యక్రమం చేపట్టినట్లు తాళ్లూరి రవి వెల్లడించారు.ఉదయం ఆరు గంటలకు ప్రారంభించిన మారథాన్ సాయిబాబా టెంపుల్ నుంచి పోలీస్ స్టేషన్ వరకు సాగిందన్నారు. 2కె రన్ లో మార్నింగ్ వాకర్స్,క్రీడా కారులు, యువకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు ఉల్లాసంగా,ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. మారథాన్ కార్యక్రమంలో ఎస్ఐ బాదావత్ రవి,ఎంపిఓ తులసీరామ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మలోత్ మంగీలాల్ నాయక్,సర్పంచ్లు కోర్సా రమేష్, భూక్య జ్యోతి,కృష్ణ,ఉప సర్పంచ్ నరేష్,నవీన్,ఈజీఎస్ ఏపీఓ రామారావు,బాపట్ల వెంకటేశ్వర రావు,వేల్పుల నరసింహారావు,ఉసికల నరసింహారావు,వేల్పుల బోస్,రైస్ మిల్ రాజు,ఈజీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
