యువజన క్రీడోత్సవాల్లో కానరాని యువత

యువజన క్రీడోత్సవాల్లో కానరాని యువత

వెల వెల బోయిన 2k రన్
కొరవడిన ప్రజల భాగస్వామ్యం
అవగాహన కల్పించడంలో అధికారులు విఫలం

నర్సింహులపేట, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో 99రోజుల ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా.. 2కె రన్ మారథాన్ ను సోమవారం మండల పంచాయతీ అధికారి కిన్నర యాకయ్య ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయం వద్ద నుంచి జయపురం క్రాస్ రోడ్ వరకు మారథాన్ ప్రారంభించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ రమేష్ బాబు,మండల పంచాయతీ అధికారి కిన్నర యాకయ్య మాట్లాడుతూ.. నేటి నుంచి 23వ తేదీ వరకు యువజన క్రీడల వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. అందులో భాగంగా.. ఆరోగ్యకరమైన జీవనశైలి,క్రీడలపై అవగాహన కోసం జిల్లాలు,మండలాల వారీగా 2కే రన్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

కానరాని ప్రజల భాగస్వామ్యం..

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యువజన వారోత్సవాలు నిర్వహించాలని పిలుపునిస్తే,నేడు మండలంలో జరిగిన 2కే రన్ ప్రజల భాగస్వామ్యం లేక వెల వెల బోసిపోయింది.స్థానిక ఎస్ఐ,ఇద్దరు అధికారులు,మరో నలుగురు ఉద్యోగులు,పంచాయతీ సిబ్బంది, ఒకరిద్దరు సర్పంచులు,ఒకరిద్దరు వార్డు సభ్యులు,మరో నలుగురు కాంగ్రెస్ మండల కాంగ్రెస్ నాయకులతో తూతూ మంత్రంగా నిర్వహించడం పట్ల కొంత మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యువజన ఉత్సవాల్లో యువకులు లేకపోవటం పలు విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమేష్ బాబు,మండల పంచాయతీ అధికారి కిన్నెర యాకయ్య,ఎస్ఐ వెంకన్న,సర్పంచ్ లు పెదమాముల యాకయ్య,గూగులోత్ రాజేందర్,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జినుకల రమేష్,ఎస్టీ సెల్ అధ్యక్షుడు దసృ నాయక్, వైద్య సిబ్బంది అన్వేష్,వార్డు సభ్యులు తదితరులు ఉన్నారు.

Leave a Reply