ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్

ఆరుగురు పేకాట రాయుళ్లు అరెస్ట్
తొర్రూరు, ఆంధ్రప్రభ:
పేకాట ఆడుతూ స్థానికులు పట్టుబడ్డ ఘటన ఆదివారం డివిజన్ కేంద్రంలో చోటుచేసుకుంది. ఎస్సై తోట మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం….తొర్రూరు పట్టణ శివారులో పేకాట ఆడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పోలీసులు ఆకస్మిక దాడి చేసి ఆరుగురు పేకాట రాయుళ్లను అరెస్టు చేశారు. తొర్రూరు పట్టణ శివారులో పలువురు పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకొని దాడులు చేసారు. ఆరుగురిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.25,650 వేల నగదు, మూడు ద్విచక్ర వాహనాలు, 6 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. దీనిపై విచారణ చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో అదనపు ఎస్సై ఖాదర్ పాషా, కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.
