జిల్లా స్థాయి విద్యా విజయోత్సవ వేడుకల్లో నాగుపల్లి విద్యార్థిని

జిల్లా స్థాయి విద్యా విజయోత్సవ వేడుకల్లో నాగుపల్లి విద్యార్థిని
దమ్మపేట, ఆంధ్రప్రభ : ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక లో భాగంగా జిల్లాస్థాయి విద్యా విజయోత్సవాల్లో ఆదివారం పదవతరగతి ఫలితాల్లో దమ్మపేట మండలం నాగుపల్లికి చెందిన ,దమ్మపేట మండల టాపర్ మేకా మాన్విత పాల్గొన్నారు .
కొత్తగూడెం లో జరిగిన విద్యా విజయోత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న దమ్మపేట మండల టాపర్ మాన్వితను ( జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల, నాగుపల్లి ) సర్టిఫికెట్, షీల్డ్, శాలువాతో ఘనంగా సత్కరించారు . ఈ కార్యక్రమంలో నాగుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బజ్జూరి సరళ తదితరులు పాల్గొన్నారు.
