పట్టుపడితే చుక్కలే..

పట్టుపడితే చుక్కలే..

మందు బాబులకు పోలీసులు ముకుతాడు
మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
పట్టుపడితే జైలుకే..

టేకుమట్ల, ఆంధ్రప్రభ : మందు బాబులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఆషామాషీగా కేసు రాసి, జరిమానాలతో సరిపెట్టకుండా ఏకంగా జైలుకే తరలిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలో ఇప్పటికే ఈ తరహా కేసులు నమోదయ్యాయి. సాధారణంగా ఆనందమొచ్చినా, బాధ కలిగినా మద్యం సేవించడం పలువురికి అలవాటు. ఈ క్రమంలో చాలా మంది బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతుండటం ఇప్పుడు ఫ్యాషన్గా మారింది. బర్త్ డేలు లాంటి సెలబ్రేషన్స్ ను రోడ్డుపైనే నిర్వహించుకుంటున్నారు.

మందుతాగి చిందులు వేస్తున్నారు. మరికొందరు బార్క్షాపుల్లో గంటల తరబడి మద్యం తాగుతున్నారు. అదే మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారకులు అవుతున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చట్టం చెబుతోంది. దీన్ని పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారుమద్యం తాగి వాహనాలతో రోడ్డెక్కితే కేసులు నమోదు చేసి, కోర్టు ముందు హాజరు పరుస్తున్నారు. తద్వారా ఇలాంటి వారికి న్యాయస్థానం జైలుతోపాటు జరిమానా విధిస్తోంది.

ప్రమాదాల నివారణే లక్ష్యం—-(టేకుమట్ల ఎస్ఐ అమూల్య)

ప్రమాదాల నివారణే లక్ష్యంగా మందుబాబులపై ప్రత్యేక దృష్టి సారించాం. రోడ్డు ప్రమాదాల్లో అత్యధికంగా జరిగేవి మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లే. జరిమానాలు విధిస్తున్నా చాలా మందిలో మార్పు రావడం లేదు. దీంతో ఇంకా కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించాం. మద్యం సేవించి వాహనాలతో పట్టుబడిన వారిని కోర్టులో హాజరు పరుస్తున్నాం. తద్వారా జడ్జి మందుబాబులకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తున్నారు

Leave a Reply