ఆలయ పరిసరాలు తనిఖీ చేసిన డీసీపీ..

ఆలయ పరిసరాలు తనిఖీ చేసిన డీసీపీ..

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ : పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న శ్రీ గోపయ్య సమేత శ్రీతిరుపతమ్మవారి ఆలయ పరిసరాలను ఆదివారం విజయవాడ పోలీస్ కమిషనరేట్ డీసీపీ బి లక్ష్మీనారాయణ తనిఖీ చేశారు. ముందుగా ఆయన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం ఆలయ అధికారులు వారిని అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదాలతో సత్కరించారు.

అనంతరం ఆయన ఆలయ శ్లాబ్. పరిసరాలను పరిశీలించారు. ఇటీవలన విజయవాడ శ్రీకనకదుర్గమ్మవారి ఆలయంలో పెచ్చులూడి భక్తులు గాయపడటంతో అలాంటి సంఘటనలు జరగకుండా స్థానిక ఆలయ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట సీఐ పి వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎంఎస్కె అర్జున్, ఆలయ సూపరింటెండెంట్ లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply