4 wickets | పంజాబ్ కింగ్స్ ముందు కొండంత లక్ష్యం!

4 wickets | పంజాబ్ కింగ్స్ ముందు కొండంత లక్ష్యం!

4 wickets | ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్ : ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న కీలక పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్లు చెలరేగిపోయారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోరు సాధించింది. వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీలతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు.

ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో వెంకటేశ్ అయ్యర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం బౌండరీలే లక్ష్యంగా పంజాబ్ బౌలర్లను చీల్చిచెండాడుతూ 73 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మరోవైపు స్టార్ బ్యాటర్ ‘కింగ్’ విరాట్ కోహ్లీ (58) బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో జట్టుకు బలమైన పునాది వేశాడు.

వీరిద్దరితో పాటు యువ ఆటగాడు దేవదత్ పడిక్కల్ సైతం మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పడిక్కల్ కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 45 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఇన్నింగ్స్ ఆఖర్లో టిమ్ డేవిడ్ (28) రెండు భారీ సిక్సర్లతో మెరుపులు మెరిపించగా, ఓపెనర్ జేకబ్ బెథెల్ 11 పరుగులు చేసి అవుటయ్యాడు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 223 పరుగులు చేయాల్సి ఉంది.

click here to read more : ఒకే మ్యాచ్‌లో డబుల్ రికార్డు!

click here to read more

Leave a Reply