17mayipl | ఇవాళ ఐపీఎల్లో రెండు మ్యాచులు

17mayipl | ఇవాళ ఐపీఎల్లో రెండు మ్యాచులు
17mayipl | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026 భాగంగా సండే అసలు సిసలు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచులు చాలా కీలకమైనవి. ఇప్పటికే ఐఎల్‌లో 60 మ్యాచ్‌లు పూర్తయ్యాయి. కానీ ఏ ఒక్క జట్టు అధికారికంగా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేదు. అయితే ఇవాళ జరిగే మ్యాచుల్లో విజయం సాధించే కొన్ని జట్లు ప్లేఆఫ్స్ కు చేరే అవకాశం ఉంటుంది.
ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ధర్మశాల వేదికగా జరిగే ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టే మొదటి జట్టుగా మారనుండగా.. పంజాబ్ కింగ్స్ ఓడిపోతే ఐపీఎల్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపు తప్పుకునే పరిస్థితికి వస్తుంది. పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలవగా, పంజాబ్ కింగ్స్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓడిపోయి 13 పాయింట్లతో నాలుగో స్థానానికి పడిపోయింది. దాంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా కీలకంగా మారనుంది.

ఇక రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్ – రాజస్థాన్ రాయల్స్ మధ్య పోరు జరగనుంది. రాజస్థాన్ ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకాలని చూస్తుండగా.. ఎలాగైనా విజయం సాధించి ప్లే ఆఫ్స్ సినారియోను టైట్ చేయాలని ఢిల్లీ చూస్తోంది. పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్థాన్ రాయల్స్ జట్టు ఐదో స్థానంలో ఉంది. మొత్తానికి ఈ రోజు జరిగే రెండు మ్యాచ్‌లతో ఫ్యాన్స్‌లో మంచి జోష్ రానుంది. ఈ మ్యాచ్ లైవ్‌లు స్టార్ స్పోర్ట్స్, జియో హాట్ స్టార్ వేదికగా వీక్షించనుంది.
CLICK HERE TO READ 2.22Article | మ్యాచ్ డిలే.. రూ.12లక్షల ఫైన్
