27yrs Janardhan | ఆత్మహత్యేనని నిర్ధారించిన పోలీసులు

27yrs Janardhan | ఆత్మహత్యేనని నిర్ధారించిన పోలీసులు

27yrs Janardhan | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్‌ : హైదరాబాద్‌లోని మియాపూర్ ప్రాంతంలో సీఏ విద్యార్థి జనార్ధన్ మృతి కేసులో పోలీసులు కీలక వివరాలను వెల్లడించారు. మొదట ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, దర్యాప్తు అనంతరం ఇది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పరీక్షల ఒత్తిడి, బ్యాక్‌లాగ్స్ కారణంగా యువకుడు తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు విచారణలో తేలింది.

కర్నూలు జిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన జనార్ధన్‌ (27) చెన్నైలో సీఏ చదువుతున్నాడు. చివరి సంవత్సరం పరీక్షలు రాయకపోవడం, కొన్ని సబ్జెక్టుల్లో బ్యాక్‌లాగ్స్ ఉండటంతో అతడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో మియాపూర్‌లోని గోకుల్ ప్లాట్స్‌లో స్నేహితుల వద్దకు వచ్చి ఉంటున్నాడు.

గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో జనార్ధన్ ఉరివేసుకుని మృతిచెందిన స్థితిలో కనిపించాడు. అయితే గదిలో రక్తపు మరకలు కనిపించడంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా రెండు పేజీల సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ముందుగా తన నాలుక కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసి, అనంతరం లుంగీతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసుపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.

Leave a Reply