ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
పెడన – ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం తోటమూల పెడన ఫంక్షన్ హాల్ నందు ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా అధికారులులతో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు, గ్రామీణాభివృద్ధి సంబంధిత అంశాలు మరియు ఇతర సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి, కలెక్టర్ కి తెలియజేశారు. ప్రజలు తమ వినతి పత్రాలను అందజేయగా, కాగిత కృష్ణ ప్రసాద్ వాటిని సానుకూలంగా స్వీకరించి, సమస్యలను త్వరితంగా పరిష్కరించే దిశగా అధికారులను ఆదేశించారు. వేసవి నీటి సమస్యపై ప్రత్యేక దృష్టి వేసవికాలం ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, ఎక్కడా తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా అధికారులు ఎప్పటికప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే గారు సూచించారు. “ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా నీటి సరఫరా సజావుగా ఉండేలా చూడాలి. వేసవి ఎండలు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇది ముఖ్యమైన బాధ్యత” అని అయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
ప్రజా దర్బార్‌లో అధికారులు ఎమ్మెల్యే గారి నిర్దేశాలను అమలు చేయడానికి సిద్ధమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను నేరుగా నాయకులకు చేర్చుకోవడం సాధ్యమవుతోందని స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. కాగిత కృష్ణ ప్రసాద్ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తూ, నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ ప్రజా దర్బార్ కూడా అయన ప్రజా సేవా తపనను మరోసారి ప్రతిబింబించింది.

