నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గా సూరజ్ ధనుoజయ్

నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ గా సూరజ్ ధనుoజయ్

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా సూరజ్ ధనుoజయ్ ను నియమిస్తూ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాదు ప్రభుత్వ ఉత్తర్వులు జీవో నంబర్ 950ను జారీ చేశారు. గతంలో ఇక్కడ జాయింట్ కలెక్టర్ గా పనిచేసి న కొల్లా బత్తుల కార్తీక్ గత నెలలో బదిలీపై రాష్ట్ర సచివాలయం హెడ్ క్వార్టర్ కు బదిలీ అయ్యారు. గత కొద్ది రోజులుగా ఈ పోస్ట్ ఖాళీగా ఉంది. ఆర్థిక శాఖలో డిప్యూటీ సెక్రటరీగా పని చేస్తున్న సూరజ్ ధనుoజయని నంద్యాల జిల్లాకు జాయింట్ కలెక్టర్ గా బదిలీ చేశారు.

రెవెన్యూ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టాల్సిన జాయింట్ కలెక్టర్ ఇటీవల కాలం లేకపోవడంతో అనేక ఫైల్స్ పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తుంది. పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయడానికి వెంటనే జాయింట్ కలెక్టర్ జాయిన్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.ఈ బదిలీ వెంటనే అమలులోకి వస్తుందని ప్రిన్సిపల్ సెక్రెటరీ సాయిప్రసాద్ ఉత్తర్వులు పేర్కొన్నారు.

Leave a Reply