వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
వైభవంగా వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ఠ
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ పట్టణంలోని విశ్వకర్మ కాలనీలో గల శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు.
ఈ మహోత్సవానికి ఈశ్వరీ మాత పీఠాధిపతి వీర శివకుమార స్వాములు విచ్చేసి శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు కాసోజు శంకరమ్మ, మున్సిపల్ చైర్‌పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, స్థానిక కౌన్సిలర్ ఉడుగు జ్యోతి రమేష్ గౌడ్, హైదరాబాద్ ఏసీపీ కెఎం కిరణ్‌కుమార్ చారి తదితరులు పాల్గొన్నారు.
అతిథులకు మనుమయ సంఘం అధ్యక్షుడు పంతంగి మదనాచారి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కందుకూరి కిషోర్‌కుమార్, దేవాలయ కమిటీ అధ్యక్షుడు పోలోజు శ్రీనివాసాచారి, పంతంగి నగేష్, ముటుకులోజు శ్రవణ్, చిట్టిబాబు, దేవరకొండ నరసింహాచారి, దాసోజు సంపూర్ణచారి, ముమ్మడి శ్రీనివాసాచారి, సంతోష్‌కుమార్, పోలోజు నాగేష్, పాండు చారి, శానగొండ రాజు, గోవర్ధన్ చారి, పెరికేటి నగేష్, ఎర్రోజు యాదగిరి చారి తదితరులు స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

