ఎదురెదురుగా బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

ఎదురెదురుగా బైకులు ఢీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

టేకుమట్ల, ఆంధ్రప్రభ: భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెంకట్రావుపల్లి – బోర్నపల్లి గ్రామాల శివారులో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన జనగాం కుమార్ తన ద్విచక్ర వాహనం (టీఎస్ 01 క్యూ 8754)పై వెళ్తుండగా, వెంకట్రావుపల్లి గ్రామంలో ఓ ఫంక్షన్‌కు వచ్చి తిరిగి వెళ్తున్న కమలాపూర్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ తన బైక్‌ (టీఎస్ 03 ఎఫ్‌ఎఫ్ 8546)పై ఎదురుగా వస్తుండగా రెండు వాహనాలు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో జనగాం కుమార్‌కు కాలు విరగగా, రాజ్‌కుమార్‌కు తలకు, కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను అంబులెన్స్‌లో హనుమకొండ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.