Government Hospital | పెళ్లి సందడి.. క్షణాల్లో విషాదం…

Government Hospital | పెళ్లి సందడి.. క్షణాల్లో విషాదం…

కలెక్టరేట్ ఎదుట బొలెరో వాహనం బోల్తా
6 ఏళ్ల చిన్నారి మృతి, 10 మందికి తీవ్ర గాయాలు

Government Hospital | మహబూబ్ నగర్,క్రైం, ఆంధ్రప్రభ : పెళ్లి వేడుకకు వెళ్లి ఆనందంగా తిరిగి వస్తున్న కుటుంబాన్ని ఘోర రోడ్డు ప్రమాదం విషాదంలో ముంచేసింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం సమీపంలో బుధవారం జరిగిన ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నచింతకుంట మండలం దమజ్ఞాపూర్ గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులు పాత మొల్గర గ్రామంలో జరిగిన పెళ్లి వేడుకకు హాజరై బొలెరో వాహనంలో తిరిగి వస్తున్నారు.

ఈ క్రమంలో మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఎదుటికి చేరుకోగానే వాహనం ఒక్కసారిగా అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాద తీవ్రతకు వాహనం నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఓ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మరో 10 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం?కాగా వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో దమజ్ఞాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave a Reply