పాలీసెట్-2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

పాలీసెట్-2026 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి

  • మే 13న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష

సంగారెడ్డి, ఆంధ్రప్రభ ; రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలలో మూడు సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లమా కోర్సులతో పాటు వ్యవసాయ, వెటర్నరీ డిప్లమా కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించనున్న పాలీసెట్-2026 పరీక్షకు సంగారెడ్డి జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కోఆర్డినేటర్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ పి. జానకి దేవి తెలిపారు.

ఈ నెల 13వ తేదీ బుధవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సంగారెడ్డి పట్టణం మరియు జోగిపేట్‌లో ఏర్పాటు చేసిన మొత్తం 6 పరీక్ష కేంద్రాలలో 2,068 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు.

పరీక్ష కేంద్రాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (మహిళా), సంగారెడ్డి

సెయింట్ ఆంథోనీ హై స్కూల్, విద్యానగర్, సంగారెడ్డి

ప్రభుత్వ జూనియర్ కళాశాల (గర్ల్స్), సంగారెడ్డి

ఎస్.వి. జూనియర్ కాలేజ్, రాజంపేట రోడ్, సంగారెడ్డి

ప్రభుత్వ హై స్కూల్ ఫర్ బాయ్స్, అప్పర్ బజార్, ఓల్డ్ బస్టాండ్, సంగారెడ్డి

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శివంపేట్ (జోగిపేట్)

విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు ఉదయం 9:30 గంటలకల్లా చేరుకోవాలని సూచించారు. ఉదయం 10:00 గంటల నుండి మాత్రమే పరీక్ష కేంద్రాలలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఉదయం 11:00 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేశారు.

విద్యార్థులు ఇటీవల డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. అలాగే హెచ్‌బీ పెన్సిల్, బాల్ పాయింట్ పెన్, ఎరేజర్, షార్పనర్ వెంట తీసుకురావాలని ఆమె తెలిపారు.

Leave a Reply