64వ డివిజన్లో 3వ రోజు మజ్జిగ పంపిణీ…

64వ డివిజన్లో 3వ రోజు మజ్జిగ పంపిణీ…

పాయకాపురం, ఆంధ్రప్రభ : వేసవి తాపానికి చల్లని మజ్జిగ ఒక్కటే ఉపసమనమని స్థానిక 64వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె. రవికుమార్ అన్నారు. సెంట్రల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ బోండా ఉమామహేశ్వర రావు ఆదేశాల మేరకు టీడీపీ డివిజన్ అధ్యక్షుడు కే.రవికుమార్ స్థానికులకు కండ్రికలోని డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పాదాచారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ గత సంవత్సరం వేసవి కాలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నెలరోజులు పాటు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆ రీతిగా ఈవేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడానికి నెలరోజులు పాటు మజ్జిగ, చల్లని మంచినీరు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో వెన్నుదన్నుగా ఉన్న డివిజన్ కమిటీ సభ్యులకు రవికుమార్ ధన్యవాదాలు తెలిపారు.

ఈకార్యక్రమంలో టిడిపి డివిజన్ యువ నాయకులు కాకోల్లు హర్ష సాయి, డివిజన్ ప్రధాన కార్యదర్శి ఎస్ కె బాబు, యూనిట్ ఇన్చార్జి కోమరి రాజేష్, నల్లిపోగు కన్నా, మాకం సుందర్రావు,కంకణాల బాబు, పొట్నూరి అప్పలనాయుడు, షేక్ రహీం, లంకే నాగేశ్వరి పాల్గొన్నారు.