13yrs oldgirl | మియాపూర్‌లో విషాద ఘటన

13yrs oldgirl | మియాపూర్‌లో విషాద ఘటన
13yrs oldgirl | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్‌లోని మియాపూర్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోకుల్ అపార్ట్మెంట్లో నీటి సంపులో పడి 13ఏళ్ల బాలిక మృతిచెందడం కలకలం రేపింది. ఈ ఘటనతో అపార్ట్మెంట్లో విషాద వాతావరణం నెలకొంది. బాలిక తండ్రి అదే అపార్ట్మెంట్లో వాచ్‌మన్‌గా పనిచేస్తున్నట్లు సమాచారం.
బాలిక మృతి పట్ల కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదవశాత్తు సంపులో పడిపోయిందా లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బాలిక మృతి వెనుక ఉన్న కారణాలపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
