బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి

బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలి

మోత్కూర్, ఆంధ్రప్రభ: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసును ఎటువంటి రాజకీయ వత్తిళ్లకు లొగ్గకుండా, నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, కుమారుడి ఘటనపై బాధ్యత వహిస్తూ బండి సంజయ్ ఎంపీ పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ… బండి సంజయ్ కుమారుడు పైన నమోదైన ప్రోక్సోకేసును ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపి, బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు జిట్టా గౌతం, నాయకులు నరసింహ, నాగేష్, ధనంజనేయులు, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.