పవర్​ ప్లేలో ఎవరు పైచేయి సాధిస్తారు ?

పవర్​ ప్లేలో ఎవరు పైచేయి సాధిస్తారు ?

ఆంధ్రప్రభ, వెబ్‌ డెస్క్‌: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం అందనుంది. ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ కీలక పోరులో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

పంజాబ్‌ను తక్కువ పరుగులకే కట్టడి చేసి, లక్ష్యాన్ని సులభంగా ఛేదించాలని ఢిల్లీ భావిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగుతున్న పంజాబ్ కింగ్స్ జట్టు, పవర్ ప్లేలో చెలరేగి భారీ స్కోరు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ధర్మశాల స్టేడియం చిన్నది కావడంతో ఇక్కడ సిక్సర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మెరుగుపరుచుకోవాలంటే ఇరు జట్లకు ఈ విజయం అత్యంత అవసరం. ముఖ్యంగా ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవడం ద్వారా కీలకమైన 2 పాయింట్లను సాధించాలని రెండు జట్లు పట్టుదలతో ఉన్నాయి.

Leave a Reply