హైద్రాబాద్ – తమతో విద్యాబ్యాసం చేసి ఆర్థికంగా వెనుకబడిన మిత్రుల పిల్లల చదువుకోసం ఆసరా గా చేయూత నిస్తూ ఆదర్శంగా నిలవడం అభినందనీయం అనిగురువు లు కొనియాడారు.

ZPHS ఆడివి దేవులపల్లి పూర్వ విధ్యార్థుల సమావేశం ఆదివారం స్థానిక స్వాగత్ గ్రాండ్ హోటల్ లో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిధులు గా నాటి ఉపాధ్యాయులు నాగేశ్వరరావు, రాంమోహన్ ,ప్రభాకర్ రెడ్డి , వెంకట నారాయణ లు హాజరై ప్రసంగించారు.
నాటి తమ అనుభవాలను గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఆదతాంతం ఉల్లాసంగా ఉత్సాహం గడిపారు అలాగే పూర్వ విద్యార్థులు 32 సంవత్సరాల తర్వాత ఇలాంటి సమావేశం ఏర్పాటు చేసి వారి ఉన్నతి ని జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే కాకుండాతోటి మిత్రుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం మంచి పరిణామం అని కొనియాడారు
అనంతరం సహాయం పొందిన కుటుంబాలకు చెక్కులు అందజేశారు..