పేదవారి జీవితాల మెరుగుదలకు పి.4

పేదవారి జీవితాల మెరుగుదలకు పి.4

పాయకాపురం, ఆంధ్రప్రభ : పి4 పథకం ద్వారా పేదవారి జీవితాలు మెరుగుదల అవుతుందని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనయుడు బొండా రవితేజ అన్నారు. సింగ్ నగర్ సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఆదివారం పేద ప్రజల జీవన ఉపాధి అవకాశాల కల్పన తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లను బొండా రవితేజ తన సొంత నిధులతో ఏర్పాటు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్,ఇంచార్జి పిరియ సోమేశ్వరరావు, గాజుల రవి, మాజీ కార్పొరేటర్ పైడి తులసి, అధ్యక్షుడు కూర్మాపు దుర్గారావు, సర్విపల్లి అమర్నాధ్, ఆకుల సూర్యప్రకాష్, కంచేటి నాగరాజు, బుదాల సురేష్, డిడి నాయుడు, లక్కీశెట్టి సాయి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply