అమ్మ ప్రేమ అపురూపం : సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్
కడెం, ఆంధ్రప్రభ : “అమ్మ ప్రేమ అపురూపం.. ప్రపంచంలో అతి గొప్ప వరం అమ్మ ప్రేమే. పిల్లల కోసం తన జీవితాన్నే అంకితం చేసే దేవత అమ్మ” అని పెద్దూర్–కడెం గ్రామ సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్ అన్నారు.
అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం మండల కేంద్రం కడెంలో తన సోదరీమణులతో కలిసి సర్పంచ్ దీకొండ విజయ్‌కుమార్ తమ తల్లిని శాలువాతో సన్మానించి, స్వీట్లు తినిపించి, పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు పొందారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తల్లిని గౌరవించాలని, అమ్మ ప్రేమకు సమానమైనది ప్రపంచంలో మరొకటి లేదని పేర్కొన్నారు. అనంతరం అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
