bjp | ఎక్క‌డ చూసినా హోర్డింగులు, ఫ్లెక్సీలు

bjp | ఎక్క‌డ చూసినా హోర్డింగులు, ఫ్లెక్సీలు

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్‌డెస్క్ : రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఇవాళ జ‌రిగే ప్ర‌ధాన‌మంత్రి మోదీ బ‌హిరంగ స‌భ కోసం హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌రేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. మైదానం స‌ర్వాంగ సుంద‌రంగా త‌యారైంది. నాలుగు రోజులుగా పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. నగరంలోని అన్ని ప్రధాన కూడళ్లు, వీధులు కాషాయ‌మ‌య‌మ‌య్యాయి. ఎక్క‌డ చూడు మోదీకి స్వాగతం ప‌లికే హోర్డింగులు, ఫ్లెక్సీలు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. కాషాయం జెండాలు, తోరణాలను ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు, పలువురు నాయకులు పరేడ్‌ మైదానంలోని బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించారు. కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని కార్యకర్తలు, వాలంటీర్లకు సూచించారు.సభకు వచ్చే జనాలకు ఇబ్బందులు కలగకుండా భారీ షెడ్లను ఏర్పాటు చేయడంతో పాటు తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. మైదానంలో అత్యవసర వైద్య సేవల కోసం ప్రత్యేక శిబిరంతో పాటు.. అంబులెన్స్‌ వాహనాలను సైతం ఏర్పాటు చేశారు. బహిరంగ సభ కోసం పలు జిల్లాల నుంచి భారీగా జన సమీకరణకు పార్టీ ప్రత్యేక ప్రణాళికలు చేసింది. ఇందుకోసం ప్రత్యేక రైళ్లు, బస్సులను ఏర్పాటు చేసింది.

Leave a Reply