Schedule4th | ఇంటర్ అడ్మిషన్లు చేపట్టాలని సీఎం ఆదేశం
Schedule4th | ఇంటర్ అడ్మిషన్లు చేపట్టాలని సీఎం ఆదేశం
Schedule4th | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం చేసే ప్రతిపాదనను రాష్ర్ట ప్రభుత్వం నిలిపివేసింది. ఈ ఏడాది యథావిధిగానే ఇంటర్ అడ్మిషన్లు నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇంటర్‌ను రద్దు చేసి సీబీఎస్ఈలాగా 11, 12 తరగతులు నిర్వహించాలని మొదట్లో సర్కారు భావించింది. అడ్మిషన్ల కోసం విద్యాశాఖ ఈనెల 4న షెడ్యూల్ విడుదల చేసి.. 5న రద్దు చేసింది. అయితే దీనిపై విస్తృతంగా చర్చించిన అనంతరమే విలీనం చేయాలని యోచిస్తున్నారు. అంతేకాకుండా తక్కువ సమయం ఉండటం, సాంకేతిక సమస్యలు అడ్డు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
చాలా రాష్ట్రాల్లో 10+12 విధానం అమలు చేస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి వరకు చదివిన విద్యార్థుల్లో అత్యధుకులు ఆ తర్వాత ఇంటర్మీడియట్‌కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరడం లేదు. అప్పటితో చదువును నిలిపివేస్తున్నారు.
