కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి

  • అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ: భీమ్‌గల్ మండలంలోని బడా భీమ్‌గల్, చేంగల్ గ్రామాలలో గురువారం మధ్యాహ్నం సమయంలో ఎదురుగాలులతో కురిసిన భారీ వర్షంతో వరి ధాన్యం తడవడంతో శుక్రవారం అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ … ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేసి రైతులకు పూర్తి సహకారం అందించాలని సమాధిక శాఖ అధికారులకు అడిషనల్ కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో ఆయన వెంట తహసిల్దార్ ఎం కిరణ్ కుమార్, ఆర్ఐ స్వాతి, సొసైటీ సీఈవో రవీందర్, చీంగల్ సర్పంచ్ దుమాల మమత (రాజు,)ఐకేపీ సీసీ గణేష్, వివిధ శాఖల అధికారులు తదితరులు ఉన్నారు.