సెన్సెస్‌ మెటీరియల్ పంపిణీ..

తొర్రూర్ టౌన్, ఆంధ్రప్రభ : సెన్సెస్‌-2027 కార్యక్రమానికి సంబంధించిన మెటీరియల్ పంపిణీ కార్యక్రమం శుక్రవారం తొర్రూర్ మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయుడు ఎస్‌కే దర్గా హుస్సేన్‌కు మున్సిపల్ కమిషనర్ శ్యాంసుందర్ మెటీరియల్ అందజేశారు.

తొర్రూర్ మున్సిపల్ పరిధిలో సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు మున్సిపల్ కార్యాలయంలో అవసరమైన మెటీరియల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ, సెన్సెస్‌కు సంబంధించిన వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ రెడ్డి, ప్రసన్న కుమార్, పవన్ కళ్యాణ్, ఏ. శ్రీనివాస్ రెడ్డి తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.