వైభవంగా వేణుగోపాల స్వామి రథోత్సవం..

వర్గల్, ఆంధ్రప్రభ : వర్గల్ మండల కేంద్రంలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామి రథోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగింది. ఎత్తైన భారీ కలప రథంపై శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారు గ్రామ పురవీధుల్లో విహరించారు.

భక్తుల జయజయధ్వానాలు, భాజా భజంత్రీలు, కళాకారుల నృత్యాల నడుమ రథోత్సవం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు, రాజకీయ నాయకులు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.