ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలి
ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలి
- డిమాండ్ల సాధనకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
- ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం
- సంగారెడ్డిలో తెలంగాణ జన సమితి జిల్లా ప్లీనరీ సమావేశం
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలని, ఉద్యమకారుల డిమాండ్ల సాధనకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షుడు పాతదొడ్డి తుల్జారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనతో పాటు రాజకీయ ప్రక్షాళన కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, ప్రజా సమస్యలపై స్థానికంగా నిరంతరం గళమెత్తాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీతో మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ ప్రజలకు సంబంధించిన ప్రధాన సమస్యలపై ఎప్పటికప్పుడు ఆందోళనలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు.
ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగించడం ద్వారానే పార్టీ బలపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్‌తో పాటు తెలంగాణ జన సమితి నాయకులు సాయిలు, ఆర్.లక్ష్మి, రాంరెడ్డి, మల్లారెడ్డి, మధు, విజయ్, శ్రీధర్, మల్లయ్య, వరలక్ష్మి, అనురాధ, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమ ఆకాంక్షలు నెరవేరాలి
