ఏర్గట్ల చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన బర్మ చిన్న నర్సయ్య

ఏర్గట్ల, ఆంధ్రప్రభ : తెలంగాణ హైకోర్టు వెలువరించిన కీలక తీర్పుతో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాల సందడి ప్రారంభమైంది. గతంలో ప్రభుత్వం సహకార సంఘాల పాలకవర్గాలను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేయడంతో, పాత కమిటీల పునరుద్ధరణకు మార్గం సుగమమైంది.

ఈ నేపథ్యంలో ఏర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షుడిగా బర్మ చిన్న నర్సయ్యతో పాటు పాలకవర్గ సభ్యులు గురువారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సభ్యులు, స్థానిక నాయకులు వారికి అభినందనలు తెలిపారు.