టీడీపీ నూతన కార్యాలయానికి భూమి పూజ
టీడీపీ నూతన కార్యాలయానికి భూమి పూజ
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ: కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీకి నూతన కార్యాలయ నిర్మాణానికి నేడు భూమి పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరంలోని సీ క్యాంప్ సెంటర్ సమీపంలో ఆర్ అండ్ బి కార్యాలయం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో భూమి పూజ చేపట్టారు.
ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ పాల్గొన్నారు. అలాగే నియోజకవర్గ ఇన్చార్జీలు కే మీనాక్షి నాయుడు (ఆదోని), వైకుంఠం జ్యోతి (ఆలూరు), ఎన్ రాఘవేంద్రారెడ్డి (మంత్రాలయం) తదితరులు హాజరయ్యారు.
ఇదే కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర స్థాయి నాయకులు, డైరెక్టర్లు, జిల్లా సహకార, మార్కెటింగ్ సంఘాల ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఈ భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ఈ నూతన కార్యాలయ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.
