కొలనుపాకలో క్రికెట్ క్రీడోత్సవం ప్రారంభం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక జడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంటును మాజీ డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి బుధవారం ప్రారంభించారు. క్రీడలు శారీరక,మానసిక వికాసానికి తోడ్పడతాయని ఆయన చెప్పారు. క్రీడలలో యువత, విద్యార్థులు రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవాలని సూచించారు. టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
