సహజ వ్యవసాయంతో నేల ఆరోగ్యం కాపాడాలి
సహజ వ్యవసాయంతో నేల ఆరోగ్యం కాపాడాలి
- సస్య రక్షణ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శైలు
మక్తల్, ఆంధ్రప్రభ ; రైతులు తమ పొలాల్లో యూరియా ఇతర రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించి సహజ ఎరువుల వినియోగాన్ని పెంచుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శైలు సూచించారు. భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సహజ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని అన్నారు. బుధవారం నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని అనుగొండ క్లస్టర్, గడ్డంపల్లి గ్రామ రైతు వేదిక ప్రాంగణంలో తెలంగాణ, రైతు విజ్ఞాన కేంద్రం(టివికె) నారాయణపేట వారి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సస్య రక్షణ శాస్త్ర వేత్త డాక్టర్ శైలు రైతులనుద్దేశిస్తూ మాట్లాడుతూ రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాలను వివరించారు . యూరియా ఇతర రసాయన ఎరువుల వినియోగానీ తగ్గించి, సహజ ఎరువుల వినియోగాన్ని పెంచుతూ నేల ఆరోగ్యాన్ని కాపాడాల్సిందిగా తెలియజేశారు. భూసార ఆధారిత ఎరువుల యాజమాన్యం చేపట్టాలన్నారు. సహజ ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టాలని తెలియజేశారు.
నీటి యాజమాన్యంతో భాగంగా డ్రిప్, స్ప్రింక్లర్ల వినియోగం పెంచాలన్నారు. యాంత్రీకరణ ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకుంటు పంట సాగు చేపట్టాల్సిందిగా ఆమె రైతులకు సూచించారు.మార్పులకు అనుగుణంగా పంట వైవిధ్య కరణ చేపట్టాలన్నారు. వచ్చే వానాకాలం సాగులో చేపట్టాల్సిన యాజమాన్యం రకాల ఎంపిక నాణ్యమైన విత్తనాల గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కె.విజయ్ గ్రామ సర్పంచ్ సవరమ్మ రామాంజనేయులు,అంకెంపల్లి సర్పంచ్ గొల్ల శ్రీనివాసులు,గొల్ల బాలు,నరేష్ రెడ్డి, సవరన్న ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.
