10matches | హైదరాబాద్, పంజాబ్ ఢీ

10matches | హైదరాబాద్, పంజాబ్ ఢీ
10matches | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : ఐపీఎల్ 2026లో భాగంగా ఇవాళ మరో బిగ్‌ఫైట్‌కు జరగనుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రాత్రి 7.30గంటలకు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ టీమ్ తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్ లో బ్యాటర్లుకు అనుగుణంగా.. భారీ స్కోరు చేసేందుకు వీలుగా అద్భుతమైన బ్యాటింగ్ పిచ్‌ను అందిస్తుందని అంచనా.
గత మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్ జట్టు ఓడిపోయింది. ఇవాళ ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్స్ రేసులో నిలవాలని గట్టి పట్టుదలతో ఉంది. హైదరాబాద్ జట్టు ఆడిన 10 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌ల్లో గెలిచిన సన్‌రైజర్స్.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అలాగే పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో మంచి ఊపు మీద ఉంది. ఈ జట్టు ఆడిన 9 మ్యాచ్‌లలో 6 మ్యాచ్‌ల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. పంజాబ్ జట్టు తమ చివరి రెండు మ్యాచ్‌లలో ఓడిపోయింది. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య 25 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో హైదరాబాద్ 17 సార్లు నెగ్గగా.. పంజాబ్ జట్టు 8 సార్లు విజయం సాధించింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు అంచనా..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (కెప్టెన్), శివంగ్ కుమార్, హర్షల్ పటేల్, సాకిబ్ హుస్సేన్.
పంజాబ్ కింగ్స్ తుదిజట్టు అంచనా..
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంష్ ఆర్య, కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, సూర్యాంశ్ షెడ్జ్, నెహాల్ వధేరా, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.
