అద‌న‌పు క‌లెక్ట‌ర్ ఆర్డీ మాధురి బ‌దిలీ

అద‌న‌పు క‌లెక్ట‌ర్ ఆర్డీ మాధురి బ‌దిలీ

సంగారెడ్డి ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ‌: సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఆర్డీ మాధురిని నల్గొండ జిల్లా స్పెషల్ కలెక్టర్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగ‌ళ‌వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారి టీఎల్ సంగీతను సంగారెడ్డి అదనపు కలెక్టర్‌గా నియమించింది. 2023 జూలై 19న బాధ్య‌త‌లు చేప‌ట్టిన మాధురి దాదాపు మూడేండ్ల పాటు సంగారెడ్డి జిల్లా సేవ‌లందించారు. ఇప్పుడు ఆమెను నల్గొండ జిల్లా స్పెషల్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. మాధురి స్థానంలో రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న టీఎల్ సంగీతకు పదోన్నతి కల్పిస్తూ బ‌దిలీ చేశారు. దీంతోపాటు సంగారెడ్డి జిల్లా సివిల్ సప్లై అధికారి (డిప్యూటీ కలెక్టర్ హోదా) అంబదాస్ రాజేశ్వర్‌ను మెదక్ జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా బదిలీ చేశారు. ఈ బదిలీలు పరిపాలనాపరమైన సర్దుబాట్లలో భాగంగా జరిగాయని తెలిసింది.