కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు

కాంగ్రెస్ విజయోత్సవ సంబరాలు
డోంగ్లీ, ఆంధ్రప్రభ: మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతారావు బాధ్యతలు వహించిన కేరళ రాష్ట్రం లోని ఆడూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అడ్వా. శాంతకుమార్ 8వేల పై చిలుకు మెజార్టీ తో ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా బాణసంచాలు కాల్చి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గజానంద్ దేశాయి మాట్లాడుతూ.. మా నాయకుడు బాధ్యతలు వహించిన నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాడా సంతోషకరం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డోంగ్లీ మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు లక్ష్మణ్ బచావార్,దోతీ సర్పంచ్ సంగ్రామ్ పటేల్,మోఘ సర్పంచ్ బస్వరాజ్ పటేల్,మాజీ ఎంపిటిసి దీన్ దయాల్,నాయకులు చాంద్ పటేల్, విలాస్ గైక్వాడ్,శివారెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
